కేరళలో అల్లు అర్జున్‌కు భారీ స్వాగతం

స్టాలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కు టాలీవుడ్ తో పాటు కేరళలోను భారీ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగుతో పాటు మలయాళంలో కూడా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక్కడ ఎలాగైతే హిట్ కొడతాయో అక్కడ కూడా సినిమాలు సూపర్‌హిట్ అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఆహ్వానం అందుకున్న అల్లు అర్జున్ అక్కడ జరుగుతున్న నెహ్రు ట్రోఫీ బోట్ గేమ్స్ కు ప్రత్యేక అథిదిగా హాజరయ్యారు.

కొచ్చి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అల్లు అర్జున్‌కు భారీ స్వాగతం లభించింది. అల్లు అర్జున్ వస్తున్నడని తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్‌కు వచ్చారు. తమ అభిమాన హీరో చూసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. ఉత్సాహ పరిచారు. నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత అల్లు అర్జున్ మరో సినిమాకు సైన్ చేయలేదు. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అనౌన్స్ చేస్తారని సమాచారం.