బన్నీ ఆ సినిమా క్యాన్సిల్ చేసినట్లే!

అల్లు అర్జున్, విక్రమ్ కుమార్ కలిసి ఇప్పటికే ఓ సినిమా చేయాల్సివుంది కానీ ఇప్పటివరకు వర్కవుట్ కాలేదు. నిజానికి డిజె సినిమాకు ముందు విక్రమ్.. బన్నీకు ఓ కథ వినిపించాడు. ఇంతలో హరీష్ శంకర్ లైన్ లోకి రావడంతో విక్రమ్ ను పక్కన పెట్టాడు బన్నీ. ఆ తరువాత విక్రమ్ తో సినిమా చేయాలనుకుంటే.. వక్కంతం వంశీకు ఛాన్స్ ఇచ్చాడు. దీంతో విక్రమ్..
అఖిల్ హీరోగా ‘హలో’ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు.

పోనీ తరువాత అయినా బన్నీ.. విక్రమ్ కు ఛాన్స్ ఇస్తాడా..? అనే లింగుస్వామి, మారుతిల పేర్లు వినిపిస్తున్నాయి. విక్రమ్ కూడా తన తదుపరి సినిమా నాని హీరోగా చేయాలనుకుంటున్నాడు. దీంతో ఇక బన్నీ- విక్రమ్ ల కాంబినేషన్ లో సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు జోరందుకున్నాయి.