HomeTelugu Big Storiesబన్నీని ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు

బన్నీని ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు

Allu Arjun getsTrolled
తరచూ కొత్త లుక్‌తో అశేషంగా అభిమానులను అలరిస్తున్న అల్లు అర్జున్‌ను నార్త్‌ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళంలో సైతం బన్నీకి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. పుష్ప మూవీతో నార్త్‌లో సైతం ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌కి వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తగ్గేదే లే అనే డైలాగ్‌తో అల్లు అర్జున్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు. దేశ విదేశాల్లో సైతం ఈ డైలాగ్ మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప మానియానే కనిపిస్తోంది.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్‌తో పాటు భారత్‌లోని పలు లోకేషన్లలో పుష్ప-2 షూటింగ్‌ జరుగుతోంది. ఇటీవల ఈ చిత్రంలో బన్నీకి సంబంధించిన ఓ లుక్‌ లీకైంది. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ అల్లు అర్జున్ లుక్‌ను తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఇందులో బన్నీ కాస్త లావుగా, రింగులు తిరిగిన హెయిల్ స్టైల్‌తో కనిపిస్తున్నాడు. లావుగా ఉన్న బన్నీ లుక్‌పై నార్త్‌ నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ‘వడా పావ్’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. లావెక్కాడు. క్రికెటర్‌ మలింగలా ఉన్నాడు, ఓ మై గాడ్‌ స్టైలిష్‌ స్టార్‌కు ఏమైంది ఇలా తయారయ్యాడు, ఈయన నిజంగా అ‍ల్లు అర్జున్? బాబోయ్‌ చాలా బరువెక్కాడు.. అంటూ ఇలా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CfLP91jNAz2/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu