త్రివిక్రమ్, దాసరి చిత్రాల్లో పవన్ కల్యాణ్!

pawi

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ ఇదివరకు ‘జల్సా’,’అత్తారింటికి దారేది’ చిత్రాలలో నటించాడు. రెండూ బ్లాక్స్ బాస్టర్ చిత్రాలే. గత కొన్ని రోజులుగా పవన్ మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడనే మాటలు వినిపించాయి. ఇప్పుడు ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేస్తూ.. హారిక అండ్ హాసిని బ్యానర్ లో త్రివిక్రమ్, పవన్ ల సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. అలానే దాసరి నారాయణరావు సొంత బ్యానర్ తారకప్రభు ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెంబర్ 38గా పవన్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత మిగిలిన రెండు సినిమాలు పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.