
Allu Arjun Trivikram Movie:
పాన్ ఇండియా స్టార్ అయ్యిన తర్వాత అల్లు అర్జున్ సినిమాల మీద ఆసక్తి మరింతగా పెరిగింది. ‘పుష్ప’ ఫ్రాంచైజీ ఘన విజయం సాధించడంతో ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. దీంతో బన్నీ నటించే ప్రతి సినిమా గురించి చిన్న వార్త వచ్చినా అది పెద్ద హెడ్లైన్ అవుతోంది.
గత నెలలో బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్ రద్దయిందన్న వార్తలు మీడియా హల్‌చల్ చేశాయి. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందుకే సినిమా ఆగిపోయిందన్న రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలపై బన్నీ టీం పూర్తిగా మౌనం పాటిస్తూ ఏ స్పష్టత ఇవ్వలేదు.
ఇంతలో మరో హాట్ టాపిక్ వచ్చింది. బన్నీ ఒక సూపర్ హీరో సినిమా చేయబోతున్నాడట, పేరు తాత్కాలికంగా “శక్తిమాన్”, దర్శకుడు మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ అని ప్రచారం జరిగింది. దేశంలోనే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న శక్తిమాన్ పేరుతో వచ్చే సినిమా అంటే ఊహించాల్సినంత హైప్ ఉంటుంది. కానీ దీనిపై కూడా బన్నీ టీం నుండి ఎలాంటి స్పందన రాలేదు.
ఇప్పుడు తాజాగా వెలువడిన వార్తల ప్రకారం, బన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడట. ప్రాజెక్ట్ పేరు “రావణం” అని సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించేందుకు భారీగా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అయితే ఇది అట్లీ సినిమా పూర్తయ్యాకే మొదలవుతుందట.
మరోవైపు ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలు తమ కొత్త ప్రాజెక్టుల గురించి స్వయంగా హింట్లు ఇస్తూ, ఫేక్ న్యూస్‌లను వెంటనే ఖండిస్తూ వస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తాను చేసే సినిమాల గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా, తన పీఆర్ టీమ్‌తో సహా మౌనం పాటిస్తూ వస్తున్నాడు.













