HomeTelugu Trendingటైగర్‌ నన్ను సెట్‌కు పిలవండి ప్లీజ్: బన్నీ కుమారుడు అయాన్

టైగర్‌ నన్ను సెట్‌కు పిలవండి ప్లీజ్: బన్నీ కుమారుడు అయాన్

10 13
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కుమారుడు అల్లు అయాన్‌ బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌కు వీరాభిమానట. ఆయన హీరోగా నటించిన ‘బాఘి’, ‘బాఘి 2’ సినిమాలంటే అయాన్‌కు చాలా ఇష్టమని బన్నీ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అయాన్‌ తన ఫెవరెట్‌ హీరో గురించి మాట్లాడుతున్న వీడియోను షేర్‌ చేశారు బన్నీ. దానిలో బాబు టైగర్‌కు ఓ ప్రత్యేక సందేశం పంపారు. ‘బాఘి 3’ సెట్‌కు తనను తీసుకెళ్లాలని టైగర్‌ను అయాన్‌ అడిగాడు. ‘హాయ్‌ టైగర్‌ స్క్వాష్‌.. ‘బాఘి 3′ సెట్‌కు నన్ను పిలవండి ప్లీజ్‌’ అని అడిగాడు అయాన్‌. దీనికి అక్కడే ఉన్న అల్లు అర్జున్‌ ‘ఎందుకు?’ అని ప్రశ్నించగా.. ‘ఎందుకంటే నేను ఆయన శరీరం, గన్‌ ఫైటింగ్‌ సీన్లు చూడాలనుకుంటున్నా’ అని సమాధానం ఇచ్చాడు ఈ అల్లు వారసుడు.

అయాన్‌ వీడియో చూసిన టైగర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో వెంటనే దాన్ని షేర్‌ చేశారు. ‘హాహాహా.. నా కొత్త పేరు చాలా నచ్చింది (టైగర్‌ స్క్వాష్‌ అని అయాన్‌ పిలవడాన్ని ఉద్దేశిస్తూ). కేవలం ‘బాఘి 3’కే కాదు నా అన్ని సినిమా సెట్‌లకు ఆహ్వానిస్తున్నానని అయాన్‌కు చెప్పండి అల్లు అర్జున్‌ సర్‌’ అని కామెంట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu