త్రివిక్రమ్‌ను పక్కన పెట్టి.. తమిళ రీమేక్‌ వైపు అల్లు అర్జున్?

టాలీవుడ్‌ స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్.. నాపేరు సూర్య తరువాత మరో సినిమా ప్రకటించలేదు. ఎన్నో కథలు వింటున్నప్పటికీ మంచి స్క్రిప్ట్ దొరక్కపోవడంతో ఏ సినిమాకు సైన్ చేయడం లేదన్నది సమాచారం. ‘మనం’ వంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన విక్రమ్ కుమార్ తో సినిమా ఉంటుందని అనుకున్నా.. స్క్రిప్ట్ కుదరకపోవడంతో పక్కన పెట్టారు.

ఈలోపు త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఎన్టీఆర్ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. అరవింద సమేత హిట్టవ్వడంతో.. త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు బన్నీ సిద్ధం అయ్యారు. తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ నెరేట్ చేసిన స్క్రిప్ట్ పెద్దగా నచ్చకపోవడంతో.. ఈ సినిమా కూడా పక్కన పడిందని ఫిల్మ్ నగర్ సమాచారం. అల్లు అర్జున్ కు తమిళ్ మూవీ 96 బాగా నచ్చిందని.. ఆ సినిమా రీమేక్ లో చేయాలనీ అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates