అల్లు అర్జున్‌కి ప్రత్యేక గుర్తింపు.. లండన్‌లో మైనపు విగ్రహం

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ కి ప్రత్యేక గుర్తింపు దక్కింది. తన నటనతో బన్నీ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. లండన్ లోని ప్రఖ్యాత ‘మేడం తుస్సాడ్స్’ మ్యూజియంలో మైనపు బొమ్మ రూపంలో అల్లు అర్జున్ అతి త్వరలో కనిపించనున్నాడు. ఎంతో మంది ప్రముఖుల మైనపు బొమ్మలు లండన్ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. అక్కడే అల్జు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారన్నది తాజా సమాచారం.

ఇందుకు సంబంధించిన సన్నాహకాలు మొదలైనట్టు సమాచారం. అల్జు అర్జున్ త్వరలోనే లండన్ మ్యూజియాన్ని సందర్శించడంతోపాటు, మైనపు విగ్రహం రూపొందించడానికి కావాల్సిన తన శరీర కొలతలను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దక్షిణాది నుంచి ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలను లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయగా, ఇప్పుడు అల్లు అర్జున్ వారి సరసన చేరిపోనున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates