Praneeth Hanumanthu Case:
గత కొద్దిరోజులగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రణీత్ హనుమంతు పేరు మాత్రమే వినిపిస్తోంది. యూట్యూబర్ అయిన ప్రణీత్.. అతని ఫ్రెండ్స్ తో డార్క్ హ్యూమర్ అనే ముసుగులో చేసిన ఒక చెత్త వీడియో వైరల్‌గా మారింది. తండ్రీకూతుర్ల బంధానికి శారీరక సంబంధం అంటగడుతూ వాళ్ళు ఒక వికృత వీడియో చేశారు. దాంట్లో వాళ్ళు చేసిన అసభ్యకరంగా కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అందరూ వీడియో పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
యూట్యూబర్ గా మాత్రమే కాక ప్రణీత్ హనుమంతు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశాడు. ఈ మధ్యనే సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఈ నేపథ్యంలో హరోం హర నటుడు అని కూడా కొందరు అతడిని సంబోధించారు. దీంతో సుదీర్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. అలాంటి వ్యక్తికి సినిమాలు అవకాశం ఇచ్చినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
“మంచికో చెడుకో తెలియదు కానీ నేను సోషల్ మీడియా లో ఎక్కువగా ఉండను. సోషల్ మీడియా లో జరుగుతున్న విషయాల గురించి తెలియదు. కానీ ప్రణీత్ హనుమంతుని మా సినిమాలో తీసుకున్నందుకు.. చాలా కంపరంగా ఉండే. నా తరపు నుంచి మా మూవీ యూనిట్ అందరి తరపు నుంచి మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. అతను ఇలాంటి మనిషి అని మేము అనుకోలేదు సోషల్ మీడియా అతని గురించి బయటపెట్టిన విషయాలను పూర్తిగా చదివేందుకు కూడా ధైర్యం చేయలేదు. మనం చూడదగ్గ కామెంట్లు కాదు కానీ ఇవి మనం దృష్టిలోకి తీసుకోవాలి. అసలు ఇలాంటి వాళ్ళ నీచపు ఆలోచనలకు ఒక ప్లాట్ఫారం కూడా ఉండకూడదు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మాట స్వేచ్ఛ కాదని మనం గమనించాలి.” అని సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.
దీంతో లేట్ అయినా కూడా ఈ వివాదం పై నోరు విప్పడంతో అభిమానులు సుధీర్ బాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇలా బహిరంగంగా క్షమాపణలు చెప్పినందుకు అభిమానులు సుధీర్ బాబు ను మెచ్చుకుంటున్నారు. సుధీర్ బాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.