అల్లు అర్జున్‌ని చూసి తండ్రిగా గర్వపడుతున్న: అల్లు అరవింద్‌

స్టార్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ కొడుకుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్‌. తనదైన నటనతో అల్లు రామలింగయ్య నటవారసత్వాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. తెలుగుతోపాటు మలయాళంలో సూపర్ క్రేజ్‌ సంపాదించుకోవడమే కాకుండా.. భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నాడు బన్నీ.

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా అల్లు అర్జున్‌కు భారీగా ఫాలోవర్లను సంపాదించి పెట్టింది. ఎంతలా అంటే అల్లు అర్జున్‌ను చాలా కాలం వరకు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ కొడుకుగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌ అని చెప్పుకుంటున్నారు. ఈ మార్పును ప్రస్తుతం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ఏ తండ్రికైనా కొడుకు ఎదుగుదలకు మించిన గొప్ప బహుమతి ఏముంటుంది. ఇప్పుడు అలాంటి కానుకనే నాన్నకు ఇచ్చాడు బన్నీ.

తాజాగా నిర్మాత అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకప్పుడు నేను బయటకు వెళ్లినప్పుడు నన్ను నిర్మాతగా గుర్తించేవారు. నా సినిమాలంటే ఇష్టమని చెప్పేవారు. కానీ ఇప్పుడు నేను బయటకు రాగానే చాలా మంది నా దగ్గరకు వచ్చి బన్నీ(అల్లు అర్జున్) గురించి అడుగుతున్నారు.

చాలా మంది నన్ను అల్లు అర్జున్ తండ్రిగా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తున్నారు. ఈ విషయంలో నేను బన్నీని చూసి చాలా గర్వపడుతున్నాను. తండ్రికి తన పిల్లల విజయం కంటే గొప్ప బహుమతి ఇంకేం కావాలి? అని చెప్పుకొచ్చారు’ అల్లు అరవింద్.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates