HomeTelugu News'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' ట్రైలర్

‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ ట్రైలర్

2 10

రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది‌. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ‘ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేనివారు కొందరు ఉంటే..శక్తిమేరకు నయవంచన చేసే వాళ్లు కోకొల్లలు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘ఐయామ్‌ ఆంటోనీ, మార్క్‌ ఆంటోనీ’ అని రవితేజ తనని తాను పరిచయం చేసుకుంటే..ఆయన ఎదురుగా కూర్చుని ఉన్న వెన్నెల కిశోర్‌..ఇలియానాను పరిచయం చేస్తూ..’షి ఈజ్‌ థెరిస్సా..మదర్‌ థెరిస్సా’ అని చెప్పడం నవ్వులు పూయిస్తోంది.

ఇందులో ఇలియానాది వైలెంట్‌ పాత్ర. ‘వైలెంట్‌గా ఉన్న అమ్మాయి సైలెంట్‌ అవ్వాలంటే ఆమె ప్రేమలో పడాలి’ అని రవితేజ ఇలియానాకు సూచిస్తాడు. చివర్లో..’ఇది రివెంజ్‌ కాదు రిటర్న్‌ గిఫ్ట్‌’ అని రవితేజ చెబుతున్న డైలాగ్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. ఇందులో ఇలియానా తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకొన్నారు. శనివారం ప్రీ రిలీజ్‌ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu