HomeTelugu Newsబీజేపీ ట్రాప్‌లో పడను: రజనీకాంత్‌

బీజేపీ ట్రాప్‌లో పడను: రజనీకాంత్‌

9 7
కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనకు బీజేపీ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారనీ.. కానీ తాను మాత్రం ఆ ట్రాప్‌లో పడబోననని స్పష్టంచేశారు. తన గురువు కె.బాలచందర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరుగు వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రాచీన కవి తిరువల్లూర్‌ చిత్రాన్ని బీజేపీ ట్వీట్‌ చేయడంపై చెలరేగిన వివాదంపై స్పందించాలని విలేకర్లు అడగ్గా.. తిరువల్లూర్‌తో పాటు తనపైనా కాషాయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తమిళనాట నాయకత్వ శూన్యత ఉందని, తాను రాజకీయ పార్టీ ప్రారంభించేంత వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటానన్నారు.

రజనీకాంత్‌ బీజేపీకు సానుకూలంగా ఉంటున్నారనీ.. 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఆ పార్టీలో చేరతారంటూ వస్తోన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాను బీజేపీకు చెందిన వ్యక్తి అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారనీ.. అది వాస్తవం కాదని రజనీ స్పష్టంచేశారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పోన్‌ రాధాకృష్ణన్‌తో భేటీపైనా స్పందించారు. ఆయన తనను బీజేపీలోకి రావాలని ఆహ్వానించలేదన్నారు. అయోధ్యపై తీర్పు రానున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని, కోర్టు తీర్పులను గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తమిళ ప్రాచీన కవి తిరువల్లూరు నుదుటికి, భుజాలకు విభూతి, బొట్లు.. మెడలో రుద్రాక్ష దండతో ఉన్న ఫొటోను ఇటీవల భాజపా తమిళనాడు విభాగం ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu