రైతుల కోసం పవన్ కల్యాణ్ దీక్ష


రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ సమరభేరి మోగించబోతున్నారు. ఈనెల 12 వ తేదీన కాకినాడలో రైతుల సమస్యలపై పవన్ కల్యాణ్ ఒకరోజు దీక్ష చేయబోతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వడం లేదని, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేశామని చెప్తున్న ప్రభుత్వం, ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు డబ్బు చెల్లించలేదని, కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పవన్ ఇప్పటికే కోరారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదని దీక్షకు దిగబోతున్నారు. కాకినాడలో ఉదయం 8 గంటల నుంచి ఈ దీక్ష ప్రారంభం కాబోతున్నది. ఈ దీక్షకు జనసైనికులు, రైతులు భారీ సంఖ్యలో కదిలిరావాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.