HomeTelugu Big Storiesగుండెపోటుతో అమిత్‌ మిస్త్రీ మృతి

గుండెపోటుతో అమిత్‌ మిస్త్రీ మృతి

Amit mistry passed away

ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెన్నాడుతున్నాయి. గురువారం బాలీవుడ్‌ సంగీత దర్శకుడు శ్రావణ్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదంనుంచి ఇంకా తేరుకోకముందే పరిశ్రమ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. ప్రముఖ గుజరాతీ నటుడు అమిత్ మిస్త్రీ తీవ్ర గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. ప్రతిభావంతుడైన నటుడు అమిత్ మిస్త్రీ కన్నుమూసిన వార్త షాకింగ్‌గా ఉందంటూ ఇండియన్ ఫిల్మ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా అమిత్‌ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. మిస్త్రీ మరణంపై విచారం వ్యక్తం చేసిన నటి కుబ్రా సైత్ అమిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇంకా పలువురు మిత్రులు, పరిశ్రమ పెద్దలు మిస్త్రీ అకాలమరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!