సంక్రాంతికి పవన్ కానుక!

ప్రతి పండుగకు మన హీరోలు తన కొత్త సినిమాలను రిలీజ్ చేయడమో లేక సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను, టీజర్స్ ను విడుదల చేసి తమ అభిమానులకు కానుకగా ఇస్తూ ఉంటారు. ఇటీవల న్యూ ఇయర్ కోసం పవన్ తన ‘కాటమరాయుడు’ సినిమా పోస్టర్స్ తో సందడి చేశారు. ఇప్పుడు
సంక్రాంతికి అభిమానులను ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నారు. మరో మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా టీజర్ విడుదల కానుంది.

డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ జనవరి నెలాఖరున పూర్తవుతుంది. ఉగాది నాడు సినిమాను విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని పోస్టర్స్ కు మిశ్రమ స్పందన లభించింది. దీంతో టీజర్ మాత్రం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నెల 14న సంక్రాంతి రోజున రాత్రి 7 గంటలకు ఫస్ట్ టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నారు.