HomeTelugu Newsనేరుగా అమెజాన్ ప్రైమ్ లో అమితాబ్‌ మూవీ..

నేరుగా అమెజాన్ ప్రైమ్ లో అమితాబ్‌ మూవీ..

14 5
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నటించిన తాజా చిత్రం గులాబో సితాబో. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలవుతున్నందున సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. అసలు లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తేసినా సినిమా థియేటర్లు ఓపెన్ అయి.. ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు రావాలంటే చాలాకాలం పడుతుంది. అందుకే సినీ నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఎంచుకుంటున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ నటించిన గులాబో సితాబో చిత్రం కూడా ఈ జాబితాలో చేరింది. షూజిత్ సర్కార్ దర్శకత్వంలో ఓ విలక్షణ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాని నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.

వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 17న వరల్డ్ వైడ్ గా విడుదల కావల్సి ఉంది. అయితే వరుసగా లాక్ డౌన్ పొడిగిస్తూ ఉండడంతో చిత్ర నిర్మాతలు తాజా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాను జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ తో పాటు ఆయుష్మాన్ ఖురానా కూడా ముఖ్యపాత్ర పోషించాడు. రైజింగ్ సన్ ఫిలింస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రోనీ లాహిరి, షీల్ కుమార్ నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu