తమన్నా..’నెక్ట్స్‌ ఏంటి’?

మిల్కీ బ్యూటీ తమన్నా ఒక సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా ‘అభినేత్రి 2’, ‘f2’ సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో మూవీకి సంతకం చేసేశారు. యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌కు జోడీగా ‘నెక్ట్స్‌ ఏంటి’ అనే చిత్రంలో నటిస్తున్నారు తమన్నా. ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కునాల్‌ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో నవదీప్, పూనమ్ కౌర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. లండన్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.