హాస్పిటల్ బెడ్ పై అమితాబ్‌.. అభిమానుల్లో కంగారు

బాలీవుడ్‌ బిగ్ బి కు ఎలాంటి అభిమానులు ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వారంలో ఒకసారి తన ఫ్యాన్స్ కోసం బయటకు వస్తారు. ఫ్యాన్స్ అందరికి అయన చేతులు ఊపుతూ అందరికి హాయ్ చెప్పి వారితో ఐదు నిమిషాలపాటు మాట్లాడుతారు. వయసు 70 దాటినా ఇప్పటికి బిగ్ బి సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యాడు. మరో రెండు మూడేళ్లపాటు ఆయన డైరీలో డేట్స్ ఖాళీ లేవు అంటే అర్ధం చేసుకోవచ్చు బిగ్ బి ఎంతగా బిజీగా ఉన్నారో.

అయితే, సడెన్ గా బిగ్ బి ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోను చూసి అయన అభిమానులు కంగారు పడుతున్నారు. బిగ్ బికి ఏమైంది అంటూ మెసేజ్ చేస్తున్నారు. బిగ్ బి మీరు త్వరగా కోలుకోవాలని కొందరు ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. చాలా కాలం క్రితం అమితాబ్ ను క్షయ ఇబ్బంది పెట్టింది. దాని నుంచి అయన కోలుకున్నా.. వయసు పెరగడంతో అది తిరిగి మరలా ఇబ్బందిపెడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు లివర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. అమితాబ్ తెలుగులో సైరా సినిమాలో నటించాడు. ప్రస్తుతం తమిళ్.. హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.