
Star Herione comments:
ఒకప్పుడు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నటి శోభన, తాజాగా ఆమె సినీ జీవితంలోని చేదు అనుభవాన్ని పంచుకుంది. “చెట్టు చాటున బట్టలు మార్చుకోమన్నారు, ఎంతో అవమానించారు” అంటూ ఆమె చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1990లలో గ్లామర్ క్వీన్‌గా వెలుగొందిన శోభన, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్లీ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఆమె కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన చేదు అనుభవం ఇప్పటికీ మర్చిపోలేనిదిగా పేర్కొన్నారు. ఓ ప్రముఖ సినిమా సెట్లో శోభన బట్టలు మార్చుకోవాలంటే వాహనం ఇవ్వలేదట. అప్పుడు ఆమెను చెట్టు వెనకాల వెళ్లి బట్టలు మార్చుకోవాలని చెప్పారు. ఈ ఘటన తలచుకుంటే తనకు చాలా బాధ కలుగుతోందని, అవమానించబడిన ఫీలింగ్ ఇప్పటికీ మిగిలిపోతుందని పేర్కొన్నారు.
ఈ ఘటన జరిగినప్పుడు శోభన సరసన నటించిన అమితాబ్ బచ్చన్ ఈ విషయం తెలుసుకొని, తన కార్ వాన్‌ను శోభనకు ఉపయోగించుకునేందుకు ఇచ్చారని, ఆయన గొప్ప మనసుకి కృతజ్ఞతలు చెప్పినట్లు ఆమె చెప్పారు. “అలాంటి సమయంలో ఓ పెద్ద మనిషి అండగా నిలవడం గొప్ప విషయం” అని ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు.