
Amitabh Bachchan Watch Cost:
1983లో దుబాయ్‌లో తీసిన అమితాబ్ బచ్చన్ ఓ పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్న సంగతి తెలిస్తే ఆశ్చర్యపడతారు. పెద్దగా చూసినా సాధారణంగా కనిపించే ఫోటో. కానీ, ఫ్యాన్స్ కన్ను ఎక్కడ పడిందో తెలుసా? ఆయన చేతిలో ఉన్న వాచ్ మీదే!
ఆ వాచ్ పేరు Concord Delirium Très Mince. స్పెషల్ పేరుతో పాటు, దీని వెనక ఉన్న కథ కూడా అంతే స్పెషల్. ఈ వాచ్ 1979లో విడుదలైంది. అప్పట్లో దీని ధర రూ.1.9 లక్షలు అంటే ఇప్పటి విలువతో చూస్తే లక్షల్లో కదా! అసలు విషయమేంటంటే, ఇది ప్రపంచంలోనే అతిపొడవైన క్వార్ట్జ్ వాచ్. దీని మందం కేవలం 2 మిల్లీమీటర్లే – గ్లాస్ సహా! ఇది పూర్తిగా గోల్డ్ కేస్‌తో, గోల్డ్ డయల్‌తో తయారై ఉంటుంది. లెదర్ స్ట్రాప్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది.
ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఈ వాచ్‌లో మెకానికల్ పార్ట్స్‌కి వాచ్ బ్యాక్ కవర్‌ను కూడా భాగంగా ఉపయోగించారు. ఈ ఐడియా తర్వాత స్వాచ్, ఓడమార్స్ పిగెట్, పియాజెట్ లాంటి బ్రాండ్లు కూడా ఫాలో అయ్యాయి.
అమితాబ్ బచ్చన్ అంటేనే ఓ స్టైల్ ఐకాన్. సినిమాల్లో ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ఫ్యాన్స్ ఫిదా అయితే, ఆఫ్స్క్రీన్‌లో ఆయన వాచెస్‌కి కూడా అంతే క్రేజ్. ఒమెగా నుంచి రిచర్డ్ మిల్లె వరకూ ఎన్నో బ్రాండ్ల వాచెస్ ఆయన దగ్గర ఉన్నాయి.
ALSO READ: అనుకోకుండా తన ఫోన్ నంబర్ బయటపెట్టిన Hrithik Roshan