HomeTelugu Big Storiesఅమితాబ్‌ రిటైర్‌మెంట్‌ తీసుకుంటున్నారా.!

అమితాబ్‌ రిటైర్‌మెంట్‌ తీసుకుంటున్నారా.!

10 25

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌.. 1969లో విడుదలైన ‘సాత్‌ హిందూస్థానీ’ చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. ఇటీవల ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఈ నటుడు అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా బిగ్‌బి పెట్టిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశమైంది. ఆయన పోస్ట్‌ చూసిన నెటిజన్లు త్వరలో ఆయన సినిమాల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకోనున్నారంటూ మాట్లాడుకుంటున్నారు.

బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో అమితాబ్‌ కీలకపాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మనాలీలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా బిగ్‌బి తాజాగా మనాలీకి చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన బ్లాగ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నిర్మాణంలో ఉన్న రోడ్లు, కొన్ని మంచి రోడ్లపై కారులో 12 గంటలపాటు ప్రయాణించి చివరికి ఇక్కిడికి చేరుకున్నాను.

నేను రిటైర్‌మెంట్‌ తీసుకోవాలి. నా హెడ్‌ ఒకటి ఆలోచిస్తుంటే.. నా చేతులు మరొకటి చేస్తున్నాయి. ఇది ఒక మెస్సేజ్.’ అని అమితాబ్‌ పేర్కొన్నారు. అమితాబ్‌ పెట్టిన పోస్ట్‌ చూసిన నెటిజన్లు ఆయన రిటైర్‌మెంట్‌ గురించి చర్చించుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu