HomeTelugu Big Storiesరాజుగారి గది-4 స్క్రిప్ట్ రెడీ!

రాజుగారి గది-4 స్క్రిప్ట్ రెడీ!

Raju Gari gadhi 4 movie st
యాకంర్‌ ఓంకార్ దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. తన సోదరుడు అశ్విన్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ.. ఆయన తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మంచి వసూళ్లను రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకుని ఆయన చేసిన ఈ హారర్ థ్రిల్లర్ లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో ఆయన ఇదే టైటిల్ పై ఇప్పటికే 3 సీక్వెల్స్‌ ను తెరెకెక్కించాడు.

నాగార్జున – సమంత ప్రధాన పాత్రధారులుగా ఓంకార్ రూపొందించిన ‘రాజుగారి గది 2’ ఫరవాలేదనిపించుకుంది. అవికా గోర్ తో చేసిన ‘రాజుగారి గది 3’ చేశాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఓంకార్ తదుపరి రాజుగారి గది-4 రూపొందించే ప్రణాళికలో ఉన్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందట.

ఇటీవలే ఓంకార్ ఓ మీడియా ఇంటర్వ్యూలో రాజుగారి గది-4 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడని టాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. ఈ హారర్ స్టోరీతో పాటు ఓంకార్ ఓ స్పోర్ట్స్ నేపథ్యం కలిగిన మూవీ.. అలాగే గ్రామీణ నేపథ్యంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపాడు. పరిస్థితుల కారణంగా ఓంకార్ టీవీ షో నిర్వహిస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. త్వరలోనే రాజుగారి గది-4 ప్రారంభం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu