HomeTelugu Trendingహాయ్‌ నాన్న: అమ్మాడి ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది

హాయ్‌ నాన్న: అమ్మాడి ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది

Ammaadi Full Video song fro
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. నాని 30వ సినిమాగా తెరకెక్కిన ఈమూవీకి శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మృణాళ్‌ ఠాకూర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబ‌ర్ 07న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యం అందుకుంది.

తాజాగా ఈ సినిమా నుండి అమ్మాడి సాంగ్ ఫుల్ వీడియో విడుదలైంది. ‘ప్రాణం అల్లాడి పొద అమ్మాడి’ ‘అందం కట్టేసుకుంటే అమ్మాడి’ అంటూ ఈ పాట‌ సాగింది. కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ ఆలపించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. ఇక ఈ సాంగ్‌లో నాని, మృణాల్‌ల‌ పెళ్లి అయ్యినట్లు క‌నిపించ‌డం. చూస్తుంటే ఈ జోడీ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది.

ఈ సినిమాలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటించింది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ కంపోజర్‌, హృదయం, ఖుషీ చిత్రాల‌ ఫేం హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu