27వ బర్త్‌డే జరుపుకుంటున్న దిశా పటాని

స్టైలిష్ అండ్ గ్లామరస్ బాలీవుడ్‌ హాట్ హీరోయిన్ దిశా పటాని తన నటనతోనే కాకుండా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. ఇవాళ 27వ పుట్టిన రోజు జరుపుకొంటుందీ బ్యూటీ.. తాను ఆడంబరాలకు దూరంగా ఉంటానన్నారు. ఈ బర్త్‌డేకు ఎటువంటి ప్లాన్‌ చేయలేదని..ఎంఎస్ ధోనీ, ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ ప్రస్తుతం “మలంగ్‌” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇక హీరో టైగర్‌ ష్రాఫ్‌తో దిశా డేటింగ్‌లో ఉన్నారంటూ బీ- టౌన్‌లో టాక్‌ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడు.. శివసేన పార్టీ యువసేన అధ్యక్షుడు ఆదిత్యా థాక్రేతో దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలో దిశా పటానీ తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. “దిశా.. టైగర్‌ను వదిలేసి.. రియల్‌ టైగర్‌తో తిరుగుతోంది” అని కొందరు.. “అయ్యో. టైగర్‌ బతికున్నాడా లేదా” అంటూ మరికొందరు ట్రోలింగ్‌ చేస్తున్నారు. అయితే తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉన్న ఈ ట్రోల్స్‌పై దిశా “స్నేహితులతో డిన్నర్‌, లంచ్‌కి వెళ్తే తప్పేంటి? నా దృష్టిలో స్నేహితులు అంటే అర్థం ఒకటే. అది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే అంతా నాకు సమానమే. నేను ఎలాంటి లింగ వివక్షను చూపించను” అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. అయితే బాయ్‌ఫ్రెండ్ టైగర్‌ ష్రాఫ్‌ దిశా పుట్టిన రోజు కోసం ఓ ప్రత్యేక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దిశాపటాని, టైగర్ ఇద్దరూ కలిసి తొలిసారి మ్యూజిక్ వీడియో బెఫిక్రోలో నటించారు. గతేడాది వచ్చిన బాఘి 2లో కలిసి నటించారు. టైగర్ ష్రాఫ్ మరియు దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి.