‘ప్రియాంక మాకు అంత సమయం ఇవ్వలేదు: సల్మాన్‌ ఖాన్‌

‘భారత్‌’ సినిమాలో హీరోయిన్‌గా తొలుత ప్రియాంకా చోప్రా సంతకం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. రెండు నెలల్లో షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. ఆ సమయంలో వైదొలిగారు. దీంతో వెంటనే నటి కత్రినా కైఫ్‌ను దర్శక, నిర్మాతలు హీరోయిన్‌గా తీసుకున్నారు. ‘భారత్‌’ సినిమా ప్రచారంలో భాగంగా చిత్ర బృందం సోషల్‌ మీడియా లైవ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాలోని పాత్రకు ఏ విధంగా సిద్ధమయ్యారని కత్రినాను నెటిజన్లు ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాకు సిద్ధం కావడానికి రెండు నెలల సమయం మాత్రమే లభించింది. లుక్స్‌ పరంగా సిద్ధమైతే.. మిగిలినదంతా రెడీ అయినపోయినట్లే’ అని చెప్పారు. వెంటనే సల్మాన్‌ కల్పించుకుంటూ.. ‘ప్రియాంక మాకు అంత సమయం ఇవ్వలేదు. నిజంగా కత్రినాకు సమయం ఉండి ఉంటే ఆమె ఇంకా కష్టపడేవారు’ అంటూ ప్రియాంకపై సెటైర్‌ వేశారు.

‘భారత్‌’ సినిమా జూన్‌ 5న విడుదల కాబోతోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రినాతోపాటు దిశా పటానీ హీరోయిన్‌ పాత్ర పోషించారు. టబు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరోపక్క సల్మాన్‌ ‘దబాంగ్‌ 3’లో నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అర్బాజ్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates