HomeTelugu Trendingనా భర్త ప్రోత్సహంతోనే ఆ బోల్డ్‌ సినిమాలో నటించా: ఆనంది

నా భర్త ప్రోత్సహంతోనే ఆ బోల్డ్‌ సినిమాలో నటించా: ఆనంది

Anandhi comments on mangai

టాలీవుడ్‌లో జాంబీరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్‌ లాంటి సినిమాల్లో నటించి నటి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది. ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ.. తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె స్వస్థలం తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా. తెలుగులో చాన్స్‌లు రాకపోవడంతో కోలీవుడ్‌కి వెళ్లి అక్కడ వరుస సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అసలు పేరు రక్షిత. 2021లో తమిళ కో డైరెక్టర్ సోక్రటీస్ ని పెళ్లి చేసుకుంది.

ఇప్పటి వరకూ ఈమె నటించిన సినిమాలు అన్నీంటిలోనూ చాలా పద్దతిగా కనిపించింది. తాజాగా ఆమె ఓ సినిమాలో బోల్డ్‌గా కనిపించింది. ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరమవుతారు. ఒకవేళ సినిమాల్లో నటించినా.. అసభ్యకర సన్నివేశాలు..రొమాంటిక్‌ సీన్స్‌ లేకుండా జాగ్రత్త పడతారు.

Anandhi 1

కానీ హీరోయిన్‌ ఆనంది మాత్రం ఇందుకు మినహాయింపు. పెళ్లి అయిన తర్వాత కూడా బోల్డ్‌ సినిమాలో నటించింది. అయితే అది మంచి సందేశాత్మక చిత్రం కావడం వల్లే తాను అలా నటించానని అంటుంది. అంతేకాదు ఆ సినిమాలో నటించాలని తన భర్త ప్రోత్సహించాడట. ఆ తమిళ సినిమా పేరు మంగై.

మంగై అంటే తెలుగులో పడుచు పిల్ల అని అర్థం. మున్నార్‌ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఫేస్‌ చేసింది. ఆమె అనుభవాలు ఏంటనేది ఈ సినిమా కథ. ఓ ఆడపిల్లను మగాడు చూసే కోణంలో ఈ సినిమా సాగుతుందని మేకర్స్‌ తెలిపారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడా ఈ సినిమా కథనం ఎలా సాగుతుందో తెలియజేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!