HomeTelugu Trending5 భాషల్లో నిఖిల్‌ సినిమా!

5 భాషల్లో నిఖిల్‌ సినిమా!

4 12
యంగ్‌ హీరో నిఖిల్.. ‘అర్జున్ సురవరం’తో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి ’18 పేజిస్’ కాగా, మరొకటి ‘కార్తికేయ 2’. ఈ రెండు సినిమాలపైనే పూర్తి దృష్టిపెట్టాడు నిఖిల్‌. ‘ఇతర భాషల్లో నటించే అవకాశం ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఆయనకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. “ఇతర భాషల్లో నటించాలనే ఆలోచన లేదు .. ‘కార్తికేయ 2’ సినిమాను మాత్రం ఇతర భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల్లోను నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాను” అని అన్నాడు. మొత్తానికి ‘కార్తికేయ 2’ భారీ స్థాయిలోనే విడుదల కానుందన్న మాట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu