HomeTelugu News'యాత్ర' అనసూయ లుక్‌

‘యాత్ర’ అనసూయ లుక్‌

3 12యాంకరింగ్‌తో పాటు మంచి పాత్రలతో తనకంటూ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది అనసూయ భరద్వాజ్‌. ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా వస్తున్న ‘యాత్ర’ బయోపిక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహి వి. రాఘవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తైంది. అయితే ఈ సినిమాలో అనసూయ కర్నూలుకు చెందిన రాజకీయ నాయకురాలిగా నటించనున్నారని గతంలో వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ చిత్రంలో ఆమె విలేకరిగా కన్పించనున్నారట. సెట్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు తీసిన ఫొటోను అనసూయ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. అయితే తన పాత్ర గురించి ఎలాంటి వివరాలు ప్రకటించలేదు కానీ ఆమె విలేకరి పాత్రలో నటిస్తున్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ మూవీలో రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైఎస్సార్‌ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని డిసెంబరు 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu