రవితేజ కొత్త సినిమా అప్పుడేనట..!

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత విఐ ఆనంద దర్శకత్వంలో రవితేజ మరో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుంది.

ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేయబోతున్నారట. ఇందులో హీరోయిన్లు, ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రవితేజ ఎస్‌.ఎస్‌. తమన్‌ కాంబినేషన్‌లో ‘కిక్‌’, ఆంజనేయులు, మిరపకాయ్‌, వీర, నిప్పు, బలుపు, వంటి సినిమాలు చిత్రాలు వచ్చాయి