HomeTelugu Trendingకొత్త సినిమా ప్రకటించిన అనసూయ

కొత్త సినిమా ప్రకటించిన అనసూయ

Anasuya new movie Announced

జబర్థస్త్‌ యాంకర్ అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తతం పుష్ప సినిమాలో దాక్షాయణిగా కనిపించనున్న ఈ భామ తాజాగా మరో కొత్త చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో ఒక సున్నితమైన ప్రేమకథను పరిచయం చేసిన జయ శంకర్ ఈ సినిమాతో మరో కోణాన్ని వెలికితీయాలని చూస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు ఈ చిత్రంలో అనసూయ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

బుక్ షెల్ప్స్ మధ్య ఒక బుక్ ని చదువుతూ కనిపించింది అనసూయ. ఈ ఫొటోలో ఈ అమ్మడి ఫేస్ మొత్తం కనిపించకపోయినా వయ్యారంగా నిలబడింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu