రవి కూతురుతో అనసూయ, రాహుల్‌,అలీ.. హైడ్ అండ్ సీక్

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన అన్ని షూటింగ్స్‌కు బ్రేక్ వచ్చింది. దీంతో ఎపుడు ఏదో ఒక వ్యాపకంతో ఉండే హీరో, హీరోయిన్స్, యాంకర్లు టైమ్ పాస్ కోసం ఏదో ఎంటర్టైన్మెంట్‌ను ప్రేక్షకులకు తమదైన రీతిలో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇటీవలే శ్రీముఖి, విష్ణు ప్రియ, అవినాష్ కలిసి బతుకు బలైపోయిన బండి అనే స్పూఫ్ కామెడీ షో చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగాగా ‘మీలో ఎవరికి బోర్ కొడుతుంది’ అనే స్పూఫ్ వీడియోతో ఆకట్టకున్నారు. తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్, బి‌గ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ రవి, ఆలీ రెజా వీళ్లందరు కలిసి హైడ్ అండ్ సీక్. అంటే దాగుడు మూతలు ఆట ఆడుకున్నారు. ఇందులో యాంకర్ రవి లాప్‌టాప్‌లో పని చేసుకుంటుండగా ఆయన బిడ్డ వియా వచ్చి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడమని చెప్పడం.. రవి ఓకే అనడం. వీళ్లిద్దరు మొదలుపెట్టిన ఈ గేమ్‌లో అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా ఎలా ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్‌కు ఫన్ తెప్పించారు. వీళ్లు ఆడిన ఈ దాగుడు మూతల ఆట ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.