మెగాస్టార్‌తో అనసూయ..!


మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్ఠాత్మకంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. దీని తరువాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా చేయబోతున్నారు. ఆగస్ట్‌ 22న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నది. మెగాస్టార్ ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటీకే ఆ రోల్ ను అనసూయ కోసం కేటాయించినట్లు సమాచారం. ఇప్పటికే రంగస్థలం చిత్రంలో రామ్‌చరణ్ చిత్రంలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ మరోసారి మెగా హీరోల సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ రోల్ కోసం ఆమెకు భారీ మొత్తంలో చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.