HomeTelugu Trendingమరోసారి తెరపైకి ప్రదీప్‌ పెళ్లి!

మరోసారి తెరపైకి ప్రదీప్‌ పెళ్లి!

Anchor pradeep machiraju ge
యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి సోషల్‌ మీడియాలో ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే నిలుస్తుంది. ఈ యాంకర్‌ తన పెళ్లి కోసం ఒక రియాల్టీ షో ‘స్వయంవరం’నే నిర్వహించిన విషయం తెల్సిందే. ఆ షో చాలా పెద్ద వివాదం అయ్యింది. ఇప్పటి వరకు కూడా ప్రదీప్ పెళ్లి చేసుకోక పోవడంతో చర్చనీయాంశం అయ్యింది. తాజాగా మరోసారి ప్రదీప్ మాచిరాజు యొక్క పెళ్లి ప్రస్తావన వచ్చింది. ప్రదీప్ గత కొంత కాలంగా ఒక ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈమె బుల్లి తెర మరియు సోషల్ మీడియా సెలబ్రెటీలకు ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరిస్తూ మంచి పేరును దక్కించుకుందట.

ఆ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రదీప్ పెళ్లి అని, ఈ కులాంతర వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రదీప్ సన్నిహితులు మాత్రం ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే ఏడాదిలో ప్రదీప్ పెళ్లి ఉంటుందని మాత్రం ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు నమ్మకంగా చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!