HomeTelugu Big Storiesఫ్రెండ్స్‌తో రష్మీ రచ్చ .. వీడియో వైరల్‌

ఫ్రెండ్స్‌తో రష్మీ రచ్చ .. వీడియో వైరల్‌

7 21
బుల్లి తెరపై తన అందచందాలతో పాటు చురుకైన వ్యాఖ్యానంతో అదరగొడుతూ వీక్షకుల్నీ కట్టిపడేస్తోన్న హాట్‌ యాంకర్ రష్మీ గౌతమ్‌. ఈ భామ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే ఛాన్స్‌ వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ.. తన అందలతో కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు టాకీస్’ కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు ఆమె అభిమానులు. అది అలా ఉంటే రష్మీలో మరో కోణం.. సామాజిక అంశాలపై స్పందించడం. మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని.. ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. అది అలా ఉంటే షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే రష్మీ.. తన స్నేహితులతో కలిసి కారులో ఆడుతూ పాడుతూ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రష్మీ తన ఫ్రెండ్స్‌తో ఓ కారులో మంచి ఊపున్న పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu