HomeTelugu Trendingనాగార్జున సినిమాలో రష్మి!

నాగార్జున సినిమాలో రష్మి!

Rashmi in nagarjuna movie

రష్మి గౌతమ్‌ బుల్లితెరపై యాంకర్‌గా వ్యవహరిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా సందడి చేస్తుంది. తాజాగా ఆమె నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా గోవాలో తన మొదటి షెడ్యూల్ షూటింగ్‌ జరుపుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ కూడా మొదలు కానుంది. ఈ సినిమాలో కాజల్‌ నటిస్తోంది. సినిమాను శ్రీవేంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రష్మి గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’లో తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆ పరిచయంతోనే ఆమెకు అవకాశం లభించిందనే టాక్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu