HomeTelugu Big Stories'అన్నీ మంచి శకునములే' టీజర్‌

‘అన్నీ మంచి శకునములే’ టీజర్‌

Anni Manchi Sakunamule Teas

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ‘కల్యాణం కమనీయం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్‌గానే నిలిచింది. ఈ క్రమంలో ఆయన ‘అన్నీ మంచి శకునములే’ సినిమా చేస్తున్నాడు.

వైజయంతి ఫిల్మ్స్, స్వప్నా సినిమాస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‍‌ను విడుదలైంది. ఈ టీజర్‌ను దుల్కర్ సల్మాన్ విడుదల చేశాడు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఫ్యామిలీ డ్రామాతో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది.

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, గౌతమి, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలా మొదలైంది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ లాంటి సూపర్ హిట్లు అందుకున్న నందిని రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu