HomeTelugu Trending'చై-దక్ష' వైరల్‌ వీడియోపై దర్శకుడి స్పందన

‘చై-దక్ష’ వైరల్‌ వీడియోపై దర్శకుడి స్పందన

Kalyan krishna comments nag
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ మూవీ ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లో నాగ చైతన్య, హీరోయిన్ దక్ష నగార్కర్ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతుండగా.. చై వెనక్కి తిరిగినప్పుడు దక్ష కనుబొమ్మలు ఎగురవేయడం, అందుకు చై సిగ్గు పడడం.. ఈ క్యూట్ వీడియో అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఈ వీడియోపై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. అక్కినేని హీరో సైట్ కొడుతున్నాడని, దక్ష అక్కినేని కోడలిగా ట్రై చేస్తుందని ఇలా రూమర్స్ గుప్పుమన్నాయి. ఇక ఈ క్రమంలో ఈ వీడియోపై డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ స్పందించాడు.

Kalyan krishna1

బంగార్రాజు సక్సెస్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ … ఆరోజు జరిగినదాంట్లో చై తప్పేమి లేదు. మొదటి నుంచి చై మొహమాటస్తుడు. బహు సిగ్గరి అని అందరికి తెలిసిందే. ఆరోజు కూడా వెనక ఏదో సౌండ్ వస్తే వెనక్కి తిరిగాడు. అప్పుడే దక్ష ఏంటీ అని కళ్ళు ఎగరేసింది. దానికి చై సిగ్గుపడుతూ మాట్లాడకుండా ఇటు తిరిగేశాడు. అంతా దక్ష వలనే జరిగింది చైతన్యది ఏం లేదు, అంతా నువ్వే చేశావు’ అంటూ హీరోయిన్‌ వైపు చూస్తూ.. చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా చైతన్య క్యారెక్టర్ ని 24 క్యారెట్స్ బంగారంతో పోల్చాడు. చైతూ బంగారం .. ఇది అతనితో పనిచేశాక తెలిసింది. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం చేసినప్పుడు 24 క్యారెట్స్ అయితే బంగార్రాజుతో 48 క్యారెట్స్ గా మారాడు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!