HomeTelugu Trendingబాలకృష్ణ సినిమాలో నెగెటివ్‌ పాత్రలో అంజలి!

బాలకృష్ణ సినిమాలో నెగెటివ్‌ పాత్రలో అంజలి!

Anjali villain role in bal

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో అంజలికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. తెలుగు నుంచి కూడా ఆమె ఖాతాలో హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో అంజలికి సరైన అవకాశాలు లేవు .. తన స్థాయికి తగిన పాత్రలూ పడలేదు. ‘నిశ్శబ్దం’ .. ‘వకీల్ సాబ్’ సినిమాల తరువాత ఆమె ఇక్కడ ఏ సినిమాలు చేయలేదు. తాజాగా మాత్రం బాలకృష్ణ సినిమా కోసం ఆమె పేరు వినిపిస్తోంది. బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి అనిల్ రావిపూడి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇది తండ్రీ కూతుళ్ల అనుబంధం ప్రధానంగా సాగుతుందని తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు.

ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుందని ఆయనే చెప్పాడు. ఇక హీరోయిన్‌లుగా ప్రియమణి – మెహ్రీన్ పేర్లు వినిపించాయి. తాజాగా అంజలి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో అంజలి నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘డిక్టేటర్’ తరువాత బాలయ్యతో ఆమె చేసే సినిమా ఇదే అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!