అన్న కోసం ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తాడా..?

కల్యాణ్ రామ్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ఇజం’ సినిమాలో
ఓ ముఖ్యమైన అతిథి పాత్ర ఉందట. రీసెంట్ గా హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ అయితే
ఈ పాత్రకు మరింత ప్రాముఖ్యత చేరుతుందని, అంతేకాకుండా అన్నదమ్ములు ఇద్దరు
ఒకేతెరపైకనిపిస్తే.. వచ్చే కిక్కే వేరని చిత్రబృందం భావిస్తోంది. ‘జనతాగ్యారేజ్’ హిట్
తరువాత ఎన్టీఆర్ కాస్త గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. కనీసం రెండు
నెలలు కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపధ్యంలో ‘ఇజం’ సినిమాలో
గెస్ట్ రోల్ చేస్తాడా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ తన అన్న కల్యాణ్ రామ్ గనుక
నటించమని అడిగితే ఎన్టీఆర్ కాదనడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates