
జనసేనాని, తన మిత్రుడు పవన్‌కల్యాణ్‌పై పోటీకి సిద్ధం అంటూ కమెడియన్ అలీ కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అనే పదవి వచ్చాక అలీ సై అంటే సై అంటున్నాడు. తనకొచ్చిన పదవిలో మ్యాటర్ ఎలాగూ లేదు. కాబట్టి తానే బిల్డప్ కు పోతున్నాడు. సీఎం జగన్ ఆదేశిస్తే… ఎవరిపైనైనా, ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమంటున్నాడు. మంచిది అలీ.. కానీ గెలుపు సాధ్యమేనా?, పవర్ స్టార్ అనే ఇమేజ్ ఉంటేనే గెలుపు పిలుపు అందలేదు. ఇక నువ్వొక కమెడియన్ వి. మరీ నిన్ను నమ్మి ఓట్లు ఎలా వేస్తారు ?,
పైగా పవన్‌పై పోటీ చేయడానికి రెడీ అని తేల్చి చెప్పడం అది నీ రాజకీయ అమాయకత్వానికి నిదర్శనమే. పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయాడు. కారణం.. టీడీపీకి వ్యతిరేకంగా పవన్ పోటీలో ఉన్నాడు. కానీ, ఈ సారి టీడీపీతో జనసేన కు పొత్తు కుదరొచ్చు. ఇంకా చెప్పాలటే.. అప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం. అలాంటి పవన్ పై పోటీకి సై అంటూ పిల్ల స్టేట్ మెంట్లు ఇచ్చి.. ఉన్న సినిమా అవకాశాలను కూడా ఎందుకు దూరం చేసుకుంటావ్ ఆలీ. పవన్ కళ్యాణ్ వల్ల నువ్వు ఎలాంటి గౌరవం పొందావో మర్చిపోతే ఎలా అలీ.
నిజానికి అలీ, పవన్‌కల్యాణ్ మంచి మిత్రులు. చాలా సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఇద్దరూ కలిస్తే సరదాలకు తక్కువేం ఉండదు. ఒక హాస్య నటుడివైనా నీకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన గౌరవం ఇది. అయితే వైసీపీలోకి అలీ ఎప్పుడైతే చేరాడో.. అప్పటి నుంచి అలీ పవన్ కి దూరంగా ఉంటున్నాడు. పవన్ సినిమాల్లో కూడా అలీకి అవకాశాలు రావడం లేదు. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అలీ కుమార్తె పెళ్లికి కూడా పవన్ వెళ్లకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. విమానం ఆలస్యం కావడంతో పవన్ పెళ్లికి రాలేకపోయినట్టు ఆ తర్వాత అలీ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.
సరే వివరణ ఇచ్చాడులే అని కొందరు అలీకి అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక అలీ మళ్లీ బిజీ అవుతాడు అనుకున్నారు. కానీ, అంతలోనే అలీ మళ్ళీ తనకు తానే అన్యాయం చేసుకున్నాడు. పవన్ తనకు రాజకీయంగా ప్రత్యర్థి అనే విధంగా మాట్లాడి.. పైగా పవన్‌పైనే పోటీకి సన్నద్ధంగా ఉన్నట్టు అలీ ప్రకటించడం పవన్ ఫ్యాన్స్ నే కాదు, సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. బటన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్మి.. అలీ నిజంగానే కమిడియన్ అయ్యాడని ప్రజలు కూడా నమ్ముతున్నారు.
దీనికితోడు అలీ నోరు జారాడు. రాజకీయం, సినిమా, స్నేహం వేర్వేరు. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో, చేస్తారో ప్రజలకు బాగా తెలుసు అనట్టు అలీ చెప్పుకొచ్చాడు.పైగా 175కు 175 సీట్లలో వైసీపీ గెలుస్తుందని అలీ ధీమా వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా బటన్ రెడ్డిని గుడ్డిగా నమ్మిన థర్టీ ఇయర్స్ పృథ్వి పరిస్థితి ఏమైందో చూశాం. బటన్ రెడ్డిని నమ్మిన మరో మేక అలీ. త్వరలోనే అలీ బలికి రంగం సిద్దం.













