Homeతెలుగు Newsటీడీపీలోకి లగడపాటి రాజ్‌గోపాల్‌?

టీడీపీలోకి లగడపాటి రాజ్‌గోపాల్‌?

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ తెలుగు రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. సర్వేల పేరుతో హడలెత్తించే ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ పొలిటికల్‌ రీ ఎంట్రీకి ముహూర్తం సిద్ధమయినట్టే కనిపిస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో వరసగా విజయవాడ లోక్‌సభ సీటు నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా విజయం సాధించిన లగడపాటి సమైఖ్యాంధ్ర కోసం చేసిన పోరాటంలో హీరో అయ్యారు. రాష్ట్ర విభజన టైమ్‌లో పార్లమెంట్లో లగడపాటి చేసిన హడావిడి మాములుగా లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని నిట్టనిలువున విభజించడంతో కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరవేసిన రాజగోపాల్‌ ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నా రాజగోపాల్‌ మాత్రం సర్వేల పేరుతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నారు.ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వీలున్నప్పుడల్లా మీట్‌ అవుతున్న రాజగోపాల్‌ ఆయన పొలిటికల్‌ రీ ఎంట్రీ తిరిగి టీడీపీ అయితేనే ఉంటుందనేలా హైప్ పెంచుతున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం రాజగోపాల్‌కు వైసీపీ నుంచి హామీ వచ్చిందని… ఆయన మైలవరం అసెంబ్లీకి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న రూమర్‌ కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత లగడపాటి చంద్రబాబును తరుచూ కలుస్తుండడంతో ఆయన టీడీపీలోకే వెళ్లి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.

9 18

విజయవాడ నుంచి సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నాని బలంగా ఉండడంతో ఆయనను ఏలూరు లోక్‌సభ సెగ్మెంట్‌ నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏలూరు సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మాగంటి బాబును కైకలూరు నుంచి అసెంబ్లీ బరిలో దింపీ రాజగోపాల్‌ను లోక్‌సభకు అక్కడ నుంచి పోటీ చేయించేలా చంద్రబాబు వ్యూహం రచించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏలూరు లోక్‌సభ సీటు రేసులో టీడీపీ నుంచే ఇద్దరు, మగ్గురు పేర్లు వినిపిస్తుండడం విశేషం.
ప్రముఖ పారిశ్రామిక వేత్త దివంగత మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మనవడు ప్రముఖ పారిశ్రామిక వేత్త బోళ్ల రాజీవ్‌తో పాటు ప్రముఖ సినీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు సమీప బంధువుతో పాటు రాజగోపాల్‌ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. మాగంటిని తప్పించాలని చంద్రబాబు భావిస్తే ఆయనకు కైకులూరే ఆప్షన్‌గా కనిపిస్తోంది. సీనియర్‌ నేత కావడం, పార్టీ పట్ల అంకిత భావంతో ఉండడంతో ఆయనను పూర్తిగా పక్కన పెట్టకుండా కైకలూరు అసెంబ్లీ రేసులో దింపి…. ఏలూరు ఎంపీ సీటు మరొకరికి ఇచ్చే ఛాన్స్‌ ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికల వేళల ఈ ఈక్వేషన్లు ఎలా ? మారతాయో చూడాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu