HomeTelugu Trendingరిపీట్‌ కానున్న లైగర్‌ కాంబినేషన్‌!

రిపీట్‌ కానున్న లైగర్‌ కాంబినేషన్‌!

another movie Vijay devarak

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్టుపై ఉండటం వలన ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. పూరి టేకింగ్‌పై విజయ్‌కి అవగాహన పెరిగితే, విజయ్‌లో తాను చూపించవలసిన మాస్ హీరోయిజం మరింత ఉందని పూరి భావిస్తున్నాడట. అందువలన ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

‘లైగర్’ను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత శివ నిర్వాణ సినిమాను పూర్తి చేసి, మళ్లీ పూరితో కలిసి విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్ట్‌తో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే పూరి, విజయ్‌లు స్పందించే వరకు వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu