HomeTelugu Trendingనా సామి రంగ: ఫస్ట్‌ సింగిల్‌ అప్డేట్‌

నా సామి రంగ: ఫస్ట్‌ సింగిల్‌ అప్డేట్‌

naa saami ranga movie first
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’. విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రానున్న విష‌యం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన అప్డేట్స్‌ అంచనాలు పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేక‌ర్స్ మ్యూజిక‌ల్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే అనే సాంగ్‌ను త్వ‌రలోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

దీనితో పాటు ఈ సినిమా నుంచి నాగార్జున కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరితో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. M.M కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu