అమెజాన్‌లో ‘జాతిరత్నాలు’


టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవీన్ పోలిశెట్టి, హాస్య నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఈ సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‏గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అనుదీప్ కేవీ డైరెక్షన్‌ వహించగా స్వప్న సినిమాస్ బ్యానర్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మార్చ్‌ 11న విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు ‘జాతిరత్నాలు’. తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 11 నుంచి ఈ చిత్రం ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. దీంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates