పవన్ హీరోయిన్ తో బన్నీ!

‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయిన బ్యూటీ అను ఎమ్మాన్యుయల్. ఆమె చేసింది రెండు సినిమాలే అయినా.. పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. నిజానికి పవన్ సినిమాలో అను చేసేది సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్. మెయిన్ హీరోయిన్ కీర్తి సురేష్. కానీ అందరి దృష్టి మాత్రం అను పైనే పడింది. ఆకట్టుకునే అందం, నటన ఉండడంతో దర్శకులు, హీరోలు తమ సినిమాల్లో అనుని హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అను ఎమ్మాన్యూయల్ మరో స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే సినిమాలో నటించబోతున్నాడు. 

ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. అందులో ఒక హీరోయిన్ గా అనుని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పవన్ సినిమాలో నటిస్తుండడంతో అనుకి అవకాశాలు తొందరగానే వస్తున్నాయి. అలానే ఎన్టీఆర్ సినిమాలో ఆమెనే తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు. వరుసగా ఇద్దరు స్టార్ హీరోల సరసన అవకాశాలు సంపాదించిది గనుక కెరీర్ పరంగా ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేదు.