HomeTelugu Trending'అనుకోని ప్రయాణం' మూవీ ట్రైలర్‌

‘అనుకోని ప్రయాణం’ మూవీ ట్రైలర్‌

Anukoni Prayanam Trailer

జగన్మోహన్ రెడ్డి నిర్మాణంలో.. వెంకటేశ్ పెదరెడ్ల దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘అనుకోని ప్రయాణం’. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇద్దరు స్నేహితులు భువనేశ్వర్ లో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పనులు చేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కరోనా సమయంలో పనులు నిలిచిపోతాయి. అదే సమయంలో ఒక స్నేహితుడు చనిపోతాడు. తన మృతదేహాన్ని తన సొంత ఊరు రాజమండ్రికి తీసుకెళ్లమనేది అతని చివరి కోరిక.

దేశమంతా లాక్ డౌన్ నడుస్తుండగా ఆ శవాన్ని తీసుకుని బయల్దేరిన స్నేహితుడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే కథ. రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు, నారాయణరావు, రవిబాబు, ప్రేమ, తులసి, ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!