HomeTelugu Big Storiesఅనుపమ బెట్టు చేసిందట!

అనుపమ బెట్టు చేసిందట!

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు ఈ మధ్య టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ‘అ ఆ..’,’ప్రేమమ్’ సినిమాలతో అమ్మడుకి యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. రీసెంట్ గా శతమానం భవతి సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో
నటించే అవకాశం కొట్టేసింది. నిజానికి తనను సంప్రదించే అవకాశాలు ఉన్నాయని ముందుగానే అమ్మడుకి తెలియడంతో రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి.

శతమానం భవతి సినిమాకు గాను 24 లక్షలు వరకు పారితోషికం అందుకుంది. చరణ్ సినిమాకు యాభై లక్షల వరకు ఇవ్వమని నిర్మాతలను అడుగుతోందట. ఒకానొక దశలో దర్శకుడు సుకుమార్ మరో హీరోయిన్ ను తీసుకోవాలనే ఆలోచనలు కూడా చేశాడట. కానీ ఫైనల్ గా 35 నుండి 40 మధ్యలో అమ్మడుని ఒప్పించి రెమ్యూనరేషన్ ను ఫిక్స్ చేసినట్లు టాక్. మొత్తానికి అనుపమ నిర్మాతలతో బేరాలు సాగించి తనకు కావల్సిన మొత్తాన్ని రాబట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu