HomeTelugu Trendingపాన్‌ ఇండియా మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌!

పాన్‌ ఇండియా మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌!

Anupama parameswaran in rav
మాస్‌ మహారాజా ర‌వితేజ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే రవితేజ ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబ‌ర్‌లో షూటింగ్ ప్రారంభించ‌నుంది.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారట‌. కాగా ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ట‌. ఇటీవలే అనుపమ హీరోయిన్‌గా నటించిన ‘కార్తికేయ‌-2’. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని పనిచేసిన విష‌యం తెలిసిందే. అనుప‌మ‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే క‌థ‌ను నెరేట్ చేయ‌గా.. త‌ను వెంట‌నే ఓకే చెప్పింద‌ట‌. ఈ చిత్రంలో ర‌వితేజ అల్ట్రా స్టైలిష్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రానికి ‘ఈగ‌ల్’ అనే టైటిల్‌ను మేకర్స్ ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!