HomeTelugu Trendingకొడుకుతో కలిసి నటించనున్న శ్రీకాంత్‌!

కొడుకుతో కలిసి నటించనున్న శ్రీకాంత్‌!

Srikanth acts in his son mo
1996లో కె. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘పెళ్లిసందడి’ సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ కెరీర్ మారిపోయింది. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. వరుస సినిమాలలో నటించాడు.

తాజాగా ఈ సినిమాని అదే పేరుతో రాఘవేంద్రరావు సీక్వెల్ నిర్మిస్తున్నారు. ఆయన వద్ద పనిచేసిన గౌరి రోణంకి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. మలయాళ భామ మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకరం ఈ సీక్వెల్ లో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. అంటే, తండ్రీకొడుకుల్ని ఒకే చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నాం. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కె.కృష్ణమోహన్ రావుతో కలసి ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu