HomeTelugu Big Storiesతమన్నా ఇల్లు చూశారా?

తమన్నా ఇల్లు చూశారా?

Tamannaah bhatia home tour

మిల్కీ బ్యూటీ తమన్నా 16 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇప్పటికీ ఈమె కోసం నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 50పైగా చిత్రాల్లో నటించిన తమన్నా ముంబైలో అద్భుతమైన ఇంటిని నిర్మించుకుంది. తాజాగా తన ఇంటికి సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రమోషన్‌లో భాగంగా తన ఇంటి వివరాలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఓ ప్రముఖ పెయింటింగ్స్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో తన ఇంటిని పరిచయం చేస్తూ.. తను లేకపోయినా తన తండ్రి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని.. ఇల్లు నిర్మాణం కూడా అన్నీ నాన్న చూసుకున్నాడని చెప్పుకొచ్చింది తమన్నా.

‘సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇంటీరియర్‌ డిజైన్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని నాన్నే దగ్గరుండి చూసుకున్నారు. సినిమా షూటింగ్స్‌, ఇతర పనుల రీత్యా నేను ఇంట్లో చాలా తక్కువ సమయాన్ని గడుపుతుంటాను. అయితే ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ నివాసం నాకు ప్రతిరోజూ కొత్తగానే ఉంటుంది’ అని తమన్నా వివరించింది. అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కను కూడా పరిచయం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu